గత కొన్ని రోజుల నుంచి సమంత, నాగచైతన్య మధ్య వివాదాలు తలెత్తాయని.. త్వరలోనే విడాకులు తీసుకుంటారని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉందో తెలియదు కానీ.. రోజుకో వార్త బయటకు వస్తుంది. సమంత ఏ చిన్న ట్వీట్ చేసినా.. దానిని కూపీ లాగి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు.
మొదట సమంత సోషల్ మీడియా అకౌంట్లో అక్కినేని అనే పేరు తొలగించిన దగ్గర నుంచి ఈ వివాదం ఎక్కువ అయిపోయింది. దాంతో వారిద్దరూ విడిపోయారనే వార్తకు బలం చేకూరేలా కొందరు కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ట్విట్టర్ లో నాగచైతన్య లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను పోస్టు చేయగా.. దానికి సమంత రిప్లై ఇస్తూ.. విన్నర్.. లవ్ స్టోరి సినిమా యూనిట్‌కు, సాయిపల్లవికి బెస్టాఫ్ లక్ అంటూ ట్వీట్ చేశారు.
దాంతో అభిమానుల్లో రకరకాల కామెంట్లు పెట్టారు. అయితే తన ట్వీట్‌పై సమంత స్పందించడంపై నాగచైతన్య రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవికి, చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియచేసినందుకు చైతూ హ్యపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా థ్యాంక్యూ సామ్ అంటూ నాగచైతన్య రిప్లై ఇచ్చారు. అయితే సమంత చేసిన ట్వీట్ కేవలం సాయి పల్లవి, లవ్ స్టోరీ టీంకు మాత్రమే యాష్ ట్యాగ్ పెట్టి రిప్లై ఇవ్వడంపై ఇంకా అనుమానులు ఎక్కువ అయ్యాయి.
దీంతో దీనిపై కూడా వదంతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సమంత, చైతు రిలేషన్ గురించి నటి శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. అది ఏంటంటే.. సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య బెస్ట్ కపుల్. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటారు. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. దయచేసి రూమర్లను ప్రచారం చేయవద్దు అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…