తెలుగు, తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.
ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్, అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. ఇలా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కాజల్. అయితే గత ఏడాది ఆమె గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మెగస్టార్ సరసన ఆచార్యలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఆమె మరో సినిమాలో ఉగ్రవాదుల సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోందట. దానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. నాగ్ హీరోగా ఉన్నారు. వేశ్య పాత్ర అని తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. అలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదంతా ఇలా ఉండగా.. ఆమె గర్భం దాల్చింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న సినిమాల్లో షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…