Featured

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ సర్కార్ ఏకంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా 1000 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని 4,762 ఆరోగ్య కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు. కోటి మందికి పైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

ఏపీలో కోటికి పైగా పరీక్షలు చేశామని.. భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం ద్వారా సులభంగా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రం కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సక్సెస్ అయిందని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిన్న కొత్తగా 500 కరోనా కేసులు నమోదు కాగా 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వేగంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల రెండవ వారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. తెలంగాణ సర్కార్ డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. వ్యాక్సిన్ ను నిల్వ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రోజుకు 100 మంది చొప్పున 2.67 లక్షల మందికి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. త్వరలో అందుబాటులోకి రాబోయే సాఫ్ట్ వేర్ లో రిజిష్టర్ చేసుకొని కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ ను వేయించుకోవాలి. ఈ నెల చివరి వారం నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో జగన్ సర్కార్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది. ప్రాధాన్యత ఆధారంగా జగన్ సర్కార్ యువతకు మినహా మిగిలిన వారికి వ్యాక్సిన్ ను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

శంఖం పువ్వులే కాదు… కాయలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…

4 minutes ago

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

13 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

15 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

15 hours ago