యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన తరువాత చిత్రం కొరటాల శివ తో ఎన్టీఆర్ 30, ప్రశాంతి నీటితో ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడు.
ఇలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నట్టు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా దర్శకులలో ఒకరైన సంజయ్ లీలా బన్సాలి తో అంటూ ప్రచారం సాగుతోంది. అప్పట్లో ఈ విషయం కొద్దిరోజులు హల్చల్ చేసినా, అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరొకసారి ఈవారం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రం లాంఛనమే అంటూ వార్తలు ఉన్నాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక మైథలాజికల్ కాన్సెప్ట్ ని ఎన్టీఆర్ కోసం సంజయ్ లీలా బన్సాలీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ గా జై బావ్ రే అనే టైటిల్ ను నిర్ణయించినట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు పట్ల ఎన్టీఆర్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాల ప్రకటించగా, ఎన్టీఆర్ విధంగా బాలీవుడ్ దర్శకుడితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం నిజమైతే ఈ సినిమా పట్టాలు ఇదే ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయి లాంటి సినిమా అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది. ఈ మూవీకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ప్లీజ్ వేడుకలు రాజమౌళి దుబాయిలో ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…