సమంత, నాగచైతన్య సమంతా విడాకుల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. సోషల్ మీడియాలో అంతా నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటన చేశారు కానీ, అందుకు గల అసలు కారణం ఏమిటి అనేది ఎంతవరకు వెల్లడించలేదు.
దీనితో వీరిద్దరి విడాకులకు అసలు కారణం అదే అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తప్పు అంతా కూడా సమంతానే అన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా సమంతకు అఫైర్స్ ఉన్నాయి అని కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలు వినయ వినయ విసిగీపోయిన సమంత ఆఖరికి ఆ రూమర్స్ ఫై స్పందిస్తు వాటిలో ఎటువంటి నిజం లేదంటూ,అవన్నీ కల్పితాలే అంటూ కొట్టి పారేసింది.
సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమంతా లో చాలా మార్పులు వచ్చాయి. ఆమె విడాకులు అనంతరం ఆ బాధ నుంచి కోలుకోవడానికి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి రీతిలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలలో పాల్గొంది. సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాకుండా సమంత చాలా వరకూ సన్నిహితులతో సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సమంత తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కూతుళ్ళు ఉన్న తల్లిదండ్రులకు ఆమె హితబోధ చేసింది.మీ కూతుళ్ళని ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనేంత సమర్ధులుగా తీర్చిదిద్దండి. వారికి తొందరగా పెళ్ళి చేసేయాలన్న ఆలోచన విడనాడండి. వారిని పెళ్ళికోసం ప్రిపేర్ చేయడం కంటే వారిని వారిగా ఉండేలా చేయడం ముఖ్యం. పెళ్ళికోసం పోగేసిన డబ్బుల్ని వారి విద్యకోసం కేటాయించండి. వారిలో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా చేయండి అంటూ సమంత తల్లిదండ్రులకు సూచించారు. సమంతా పెట్టిన ఈ పోస్ట్ కు నెటిజెన్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…