సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడి వారిని పెళ్లిళ్లు చేసుకోగా మరికొందరు వారితో రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సౌరబ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈయన గతంలో నటి నగ్మాతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయినట్లు వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలు చేయడం ప్రేమ పక్షులుగా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరి గురించి అప్పట్లో మీడియా కోడై కూసింది. ఒకానొక సమయంలో ఈమె తో ప్రేమలో మునిగిపోయి ఆటపై సౌరబ్ శ్రద్ధ చూపలేక పోయారని, అందువల్ల ప్రపంచ కప్ మిస్ చేసుకున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా కెరియర్ పరంగా ఇద్దరు మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రేమలో పడ్డారని ఈ ప్రేమ కారణంగానే సౌరవ్ గంగూలీ ఎవరికీ తెలియకుండా తనని తిరుపతిలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటివరకు గంగూలీ భార్య డోనా ఈ వార్తలు గురించి విని సెలబ్రిటీల విషయంలో ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణమని భావించింది ఎప్పుడైతే డోనా వీరిద్దరు తిరుపతి వెళ్ళినట్టు మీడియాలో చూపించారో ఆ సమయంలో ఇదే విషయమై తన భర్తని నిలదీసినట్టు తెలుస్తోంది.
ఇకపోతే తనతో ప్రేమ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న డోనా తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియాకు చెప్తారా లేకపోతే నన్ను విడాకులు ఇవ్వమంటారా అని నిలదీయడంతో ప్రేమించిన వ్యక్తిని దూరం పెట్టి చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యతో సంతోషంగా గడుపుతున్నారనే విషయాన్ని ఒక సందర్భంలో సావి’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నగ్మా వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…