Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై విమర్శలు..! అది కూడా చేతకాదా..?
Vijay Sethupathi: విజయ్ సేతుపతి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు. తన నటనతో అటు తమిళంలో, ఇటు తెలుగులో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సైరా నరసింహా రెడ్డి సినిమాతో తెలుగుకు పరిచయం అయిన విజయ్ సేతుపతి… తరువాత వరసగా తన సినిమాలను డబ్ చేశారు. అయితే వీటిలో చాలా వరకు పెద్దగా హిట్ కాలేదు. అయితే నటన పరంగా విజయ్ సేతుపతికి వంక పెట్టలేము.
వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి నటించిన ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడని చెప్పవచ్చు. తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో సినిమాలో డామినేట్ చేశాడు. ఆ తరువాత పలు స్ట్రేయిట్ తెలుగు సినిమాలకు ఆఫర్లు వచ్చినా.. ఎందుకో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ లు వర్క్ అవుట్ కాలేదు. దీనికి విజయ్ సేతుపతి రెమ్యునరేషన్, కొన్ని డిమాండ్లు కూడా కారణం అయ్యాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ సేతుపలి, నయనతార, సమంత కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధం అయింది. తమిళంలో రూపొందిన ఈసినిమాను తెలుగులో కూడా డబ్ చేసి విజయ్ సేతుపతికి, సమంతకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా పేరుపైనే కాస్తా వివాదం నడుస్తోంది. సినిమా పేర్లకు తెలుగు పేర్లు దొరకడం లేదా.. అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిగా తమిళ వాసనతో ఉన్న పేరుతోనే సినిమాను విడుదల చేస్తుెన్నారు. సినిమా టైటిల్.. పూర్తిగా విజయ్ సేతుపతి, సమంత, నయనతార క్యారెక్టర్ల పేర్లని తెలుస్తుంది. కనీసం తెలుగు ప్రేక్షకులకు అర్థం అయ్యే పేర్లు పెడితే బాగుండేదని.. సినిమా రీచ్ మరింత పెరిగేదని విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…