Daamu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ కు కేసును సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు అలాగే వైఎస్ భారతి దగ్గగర పనిచేసే నవీన్ అనే వ్యక్తి పేరు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

జగన్ను బెదిరించిన అవినాష్ రెడ్డి…
వివేకానంద రెడ్డి కేసులో మొదట హార్ట్ ఆటాక్ అని చెప్పి మళ్ళీ హత్య అంటూ మాట మార్చారు. ఇక సీన్ లోకి అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వచ్చింది. ఇక సిబిఐ చేతిలోకి వెళ్ళాక కేసులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. కేసులో ఇప్పుడు అవినాష్ పేరు వినిపిస్తుండగా అవినాష్ విజయమ్మను, జగన్ ను బెదిరిస్తున్నాడని తాను విచారణలో పేరు చెప్తానని కేసులో తప్పించక పోతే జగన్ పేరు చెప్పేస్తానంటూ బెదిరించాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి కేసులో జగన్ ను డైరెక్ట్ గా పేర్కొనలేదు, కేసు మొత్తం అవినాష్ రెడ్డి, నవీన్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతోంది అంటూ అయితే వాళ్ళు హత్య చేయించేలా జగన్ ప్రేరేపించాడు అని చెప్పొచ్చు అవుడు జగన్ మెడకు ఈ హత్య కేసు చుట్టుకుంటుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ ప్రభుత్వం దగ్గర సన్నిహితంగానే ఉన్న జగన్ ఈ కేసునుండి బయటపడే ఛాన్స్ ఉంది, కాకపోతే వాళ్ళ మధ్య విబేధాలు వస్తే అవినాష్ రెడ్డికి తిప్పలు తప్పవు అంటూ చెప్పారు బాలాజీ.





























