కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ నటుడు కమల్ హాసన్‌కి, ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అంతే కాకుండా.. తెలంగాణ స్పీకర్ పోచారంకు కూడా కరోనా మహమ్మారి సోకింది. అయితే జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాణలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు.
75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెన్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడు కూడా కరోనా మహమ్మారి బారిన పడి అపస్మారకస్థితికి చేరారు. శివశంకర్ భార్యకు కూడా కరోనా సోకడంతో హోంక్వారెంటైన్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. ఇక అతడికి 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…
ప్రతిరోజూ ఉదయం చాలా మంది తమ రాశిఫలాన్ని చూసి రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు. గ్రహాల సంచారం,…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి…