శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం… దాతల కోసం ఎదురు చూపులు..!

0
6544

కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ నటుడు కమల్ హాసన్‌కి, ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అంతే కాకుండా.. తెలంగాణ స్పీకర్ పోచారంకు కూడా కరోనా మహమ్మారి సోకింది. అయితే జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాణలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు.

75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెన్షన్‌ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడు కూడా కరోనా మహమ్మారి బారిన పడి అపస్మారకస్థితికి చేరారు. శివశంకర్‌ భార్యకు కూడా కరోనా సోకడంతో హోంక్వారెంటైన్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. ఇక అతడికి 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here