Dhavala Satyam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో వందల సినిమాలకు పనిచేసి ఇండస్ట్రీ పెద్దగా గుర్తింపు పొందిన దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఈయన స్నేహితుడిగా శిష్యుడిగా ధవళ సత్యం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధవళ సత్యం ఇండస్ట్రీలో తనకు దాసరి గారికి మధ్య జరిగిన గొడవ గురించి వెల్లడించారు.
తాను రామాపురంలో సీత అనే సినిమా షూటింగ్ చిత్తూరులో చేస్తున్నాను. అక్కడ కొందరు యూనియన్ లీడర్స్ వచ్చి ఇక్కడ కార్డులు ఉన్న వారు ఒక వైపు రండి లేని వారు ఒక వైపు రండి అంటూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. నాకు సినిమా షూటింగ్ సమయంలో మధ్యలో ఎవరైనా ఇలా పనికి అడ్డు పడితే చాలా కోపం వస్తుంది. ఇలా యూనియన్ లీడర్స్ సినిమా షూటింగ్ మధ్యలో ఇలా చేయడంతో నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను.
చిత్తూరు డిఎస్పీ గారు వచ్చి నాతో మాట్లాడారు మరి వీరిపై కేసు పెడతారా అంటే పెడతాను అని చెప్పాను. అలా వారిపై కేసు పెట్టడంతో యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకెళ్లి జైలులో పెట్టారు. ఈ విధంగా యూనియన్ అనే విషపురుగు కారణంగా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అయితే అప్పట్లో యూనియన్ ప్రెసిడెంట్ గా దాసరిగారు ఉండేవారు. విషయం తెలియగానే ఆయన ఫోన్ చేసి ఒక్క క్షణంలో వాళ్ళందరూ బయట ఉండాలి అని చెప్పారు.
వాళ్లు నా సినిమాని డిస్టర్బ్ చేశారు.. అందుకే ఇలా చేశాను అని నేను ఆయనతో చెప్పాను. వాళ్లు యూనియన్ లీడర్స్.. వాళ్లు ఏమైనా చేస్తారు ముందు వాళ్లు బయటకు రావాలి అన్నారు.ఆ విషయంలో నేను వినకపోయేసరికి నువ్వంటున్నది ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకో ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా మా ఇద్దరి జర్నీలో మాకు ఇది ఒక పెద్ద మచ్చగా ఏర్పడిందని ధవళ సత్యం దాసరితో తనకు జరిగిన గొడవ గురించి తెలిపారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…