Deeksha seth : కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాల్లో నటించినా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే అవకాశాలను సరిగా సద్వినియోగం చేసుకోలేక కెరీర్ లో ముందుకు వెళ్ళలేరు. అందం, అభినయం రెండు ఉన్నా కొంతమందికి అదృష్టం కలిసిరాదు. అలాంటి హీరోయిన్ దీక్ష సేథ్, 2009 లో మిస్ ఫెమినా అందాల పోటిల్లో ఫైనల్ లిస్ట్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చింది.

అల్లు అర్జున్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వములో నటించిన వేదం సినిమాలో బన్నీకి జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత రవితేజ మిరపకాయ్ సినిమాలో నటించింది. ఇక ప్రభాస్ రెబెల్ సినిమాలోను హీరోయిన్ గా చేసింది ఆ తరువాత గోపీచంద్ ఒంటరి సినిమాలో కూడా కనువిందు చేసింది ఇక మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా లో నటించింది. అలా వరుసగా పెద్ద హీరోలతో చేసినా ఈ అమ్మడికి టాప్ హీరోయిన్ రేంజ్ మాత్రం రాలేదు.

ఇప్పుడు ఎక్కడుందో…..

అందం, అభినయం అన్ని ఉన్నా టాప్ హీరోలతో మంచి హిట్లు పడినా ఈ హీరోయిన్ కి కాలం కలిసి రాలేదనుకుంటా అందుకే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఇక తెలుగు వదిలేసి బాలీవుడ్ వైపు చూసింది. 2014వ సంవత్సరంలో లేకర్ హమ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టింది. అయితే ఇదే సంవత్సరం హిందీలో కూడా ఇంకో సినిమాలో చేసింది.

కానీ అవేవి అమ్మడి కెరీర్ కు ఉపయోగపడలేదు. ఇక ఈ సినిమాల తరువాత దీక్ష ఏ సినిమాల్లోను నటించలేదు. ఇపుడు ఎక్కడుందో ఎం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇపుడు ఈమె గురించి చర్చ మొదలయింది. ఈమె ఎక్కడుందో అని ఆరాలు మొదలుపెట్టారు. తెలుగులో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఇక అటు బాలీవుడ్ లోనూ కలిసి రాక పోవడంతో ఇండస్ట్రీ వదిలేసినా అభిమానులకు అందుబాటులో ఉండుంటే బాగుండేదేమో.































