Aishwarya -Dhanush: ఆస్పత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య.. పోస్ట్ వైరల్!
Aishwarya -Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో కూతురిగా, మరొక స్టార్ హీరో భార్యగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రజనీకాంత్ కుమార్తె ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె 18 సంవత్సరాల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
18 సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఏడాది మొదట్లోనే విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇలా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్య ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది మొదట్లోనే తన భర్తతో విడాకులు తీసుకోవడం అనంతరం కరోనా బారిన పడటంతో ఈమె 2022 సంవత్సరం నా కోసం ఇంకా ఏమి చేస్తావో అంటూ పరోక్షంగా విడాకుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…