ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారయ్యే డ్యాన్సింగ్ రియాల్టీ షో ఢీ13. దీని గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిలో జడ్జిలుగా ప్రస్తుతం పూర్ణ, ప్రియమణి, గణేశ్ మాస్టర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రోమోలో జడ్జిలు, కంటెస్టెంట్లతో పాటు టీమ్ లీడర్లు సైతం అలరించారు. ఎన్టీఆర్ నటించిన జై లవకుశలో యాంకర్ ప్రదీప్ జైగా, అరుంధతిగా పూర్ణ, మగధీర సినిమాలో మిత్రవిందగా ప్రియమణి, ఏమాయ చేశావేలో జెస్సీగా రష్మీ , గణేశ్ మాస్టర్ జానీగా, సుధీర్ ఇంద్రగా కనిపించి సందడి చేశారు.
ఈ బుధవారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండదనే చెప్పాలి. అంతే కాకుండా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కంటెస్టెంట్లు డ్యాన్సులు అదిరిపోయాయి కూడా. సుధీర్, పూర్ణ కలిగి శృంగార వీర పాటకు వేసిన డ్యాన్స్ అయితే అదో లెవల్ లో ఉంది. నరసింహ సనిమాలోని స్పూఫ్ ను ప్రియమణి, సుధీర్ చేస్తారు.
రజనీకాంత్ డైలాగ్స్ సుధీర్ చెబుతుండగా.. రమ్యకృష్ణగా ప్రియమణి కనిపించింది. దీంతోనే ప్రోమో మొదలవుతుంది. పవర్ స్టార్ నటించిన వకీల్‌సాబ్‌లో జనగణమన పాటకు ఢీ డ్యాన్సర్లు చేసిన ప్రదర్శన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది.
దీంతో అక్కడ జడ్జిలతో సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. గణేశ్ మాస్టర్ ఇంకొద్దిగ ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టు 11 న ప్రసారం అయ్యే ఈ షో ప్రతీ ఒక్కరినీ అలరించనుంది. అంతే కాకుండా ప్రతీ ఒక్కరి ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…