Sudheer Rashmi: సుడిగాలి సుధీర్, రష్మీ బుల్లితెరపైన ఎంత ఫేమసో తెలియంది కాదు. ముఖ్యంగా ఈ జంటను చూసేందుకే పలువురు వీరి షోలు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా సుధీర్- రష్మీ జోడి ఫేమస్ అయింది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందా లేదా..? అన్నది తరువాత సంగతి. తెరపైన మాత్రం వీరిద్దరిని నిజమైన లవర్లుగానే చూస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్. ‘జబర్థస్త్’, ‘ఢీ’ షోల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఢీ షోలో డాన్సుల కన్నా వీరిద్దరి మధ్య వచ్చే ఫన్నీ చూడటానికే చాలా మంది ఇష్టపడుతారు.
ఇక జబర్ధస్త్ లో వీరిద్దరిపై పంచ్ లేకుండా దాదాపుగా స్కిట్ లేకుండా ఉండదు. ఇంతలా ఈ రెండు షోలకు కీలకంగా మారారు సుధీర్- రష్మీ. అయితే అంత నార్మల్ గా ఉన్న సమయంలో వీరిద్దరికి షాక్ ఇచ్చింది మల్లెమాల, ఈటీవీ యాజమాన్యాలు.
తాజా వస్తున్న ’ఢీ‘ షో నుంచి వీరిద్దరిని తప్పించారు. దీంతో షో రేటింగ్స్ అమాంతంగా పడిపోయాయి. గతంలో వీరిద్దరు ఉన్నప్పుడు షో ఫుల్లుగా రేటింగ్స్ సంపాదించుకునేది. సుధీర్, రష్మీని ఢీ నుంచి తప్పించడంతో షో రేటింగ్ అమాంతం పడిపోయింది. తాజాగా షో రేటింగ్ 4 కే పడిపోయింది. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తో సుధీర్ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు, రష్మీ స్థానంలో టిక్ టాక్ బ్యూటీని తీసుకువచ్చారు. అయితే వీరిద్దరు ఉన్నా షోలో ఫన్ పండటం లేదు. ఇదిలా ఉంటే సుధీర్, రష్మీ లేకుండా ఢీ షోను చూడాలా అంటూ.. నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
కోర్టు ఆదేశాలతో ‘మెగా’ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమ (TFI) చరిత్రలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినిమాలపై సోషల్ మీడియాలో…
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…