Rajamouli: ప్రభాస్ చత్రపతి సినిమాలో రాజమౌళికి ఆ సీన్ ఏమాత్రం నచ్చలేదట?
Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినీ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమానే శ్వాసగా బతికే రాజమౌళి సినిమా పై ప్రాణం పెట్టి సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇక రాజమౌళి సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం పక్కా అని నిర్మాతలు గుండెలపై చేయి వేసుకొని హ్యాపీగా ఉంటారు.
ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం చత్రపతి. శ్రీయ ప్రభాస్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టించింది. ఇక అప్పటి వరుకు ఇండస్ట్రీ లో తల్లి సెంటిమెంట్ కు సంబంధించిన సినిమాలు రాకపోవడంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒక్క అడుగు అంటూ ఈ సినిమాతో ప్రభాస్ ఎస్.ఎస్.రాజమౌళి జర్నీ ప్రారంభమైంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో బాహుబలి పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చత్రపతి సినిమాలో రాజమౌళికి ఒక సన్నివేశం ఏమాత్రం నచ్చలేదట.అయితే ఈ సన్నివేశాన్ని రాజమౌళి అసంతృప్తిగానే సినిమాలో పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ రాజమౌళికి నచ్చని సన్నివేశం ఏంటి అనే విషయానికి వస్తే.. చత్రపతి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సముద్రంలో ప్రభాస్ తిమింగలంతో పోటీ పడుతూ ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. అయితే ఈ ఎంట్రీ సీన్ రాజమౌళికి ఏమాత్రం నచ్చలేదట. తాను అనుకున్న స్థాయిలో ఈ సినిమా వర్కవుట్ కాలేదని అయితే ఈ సన్నివేశాన్ని ఎంతో అసంతృప్తిగానే సినిమాలో పెట్టినట్లు ఇంటర్వ్యూ సందర్భంలో రాజమౌళి వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…