Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు గిరిబాబు ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటించారు. ఇక చివరిగా గిరిబాబు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో జడ్జి పాత్రలో నటించారు.
ఇలా సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన అవార్డులను ప్రశంసలను అందుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గిరిబాబు కుమారులు కూడా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు అయితే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు మరి గిరిబాబు వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
ప్రస్తుతం ఎన్నో సినిమాలలో కమెడియన్ గా విలన్ గా విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో రఘుబాబు ఒకరు. గిరిబాబు కుమారుడే రఘు బాబు ఈయన కూడా వందల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ నటన పరంగా రఘుబాబు ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
ఇక గిరిబాబు మరో వారసుడు బోస్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించారు అయితే ఈయన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. 1990వ సంవత్సరంలోనే గిరిబాబు దర్శకత్వంలో తన కుమారుడు బోస్ బాబును ఇంద్రజిత్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసారు. అనంతరం పలు సినిమాలలో నటించిన ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా వీరిద్దరూ గిరిబాబు కుమారులు అనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…