Diganth manchale : కన్నడ సినిమా హీరోగా మిస్ కాలిఫోర్నియా సినిమాతో పరిచయమైన దిగంత్.. గాలిపట, పంచరంగి, పారిజాత వంటి సినిమాలతో టాప్ హీరోల సరసన నిలిచాడు. 38 ఏళ్ల వయసు గల దిగంత్ తన కుటుంబంతో కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళాడు. ఒక అడ్వెంచర్ ట్రిప్ కి వెళ్లి పట్టు తప్పి పడిపోవడం వల్ల తీవ్ర గాయల పాలయ్యాడు.

మెడకు, వెన్నెముకకు తీవ్రగాయలు…
గోవాలో కుటుంబంతో కలిసి వెళ్లిన దిగంత్ ట్రంపోలిన్ మీద బ్యాక్ ఫ్లిప్ చేయబోయి పట్టు తప్పి పడిపోవడంతో మెడకు వెన్నెముకకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. మొదట గోవాలోనే హాస్పిటల్ కి తీసుకెళ్లగా పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హెలీకాప్టర్ లో బెంగళూరుకు తరలించారు. మణిపాల్ హాస్పిటల్ లో చేర్పించగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. గోవా హాస్పిటల్ లోని వైద్యులు సర్జరీ చేయడానికి సిద్ధం అవుతుండగా, దిగంత్ కుటుంబ సభ్యులు బెంగళూరు తరలించమని చెప్పడంతో హుటాహుటిన బెంగళూరుకు తరలించారు.

గోవా ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా తరలించే ఏర్పాట్లు చేయమని అధికారులకు, వైద్యులకు సూచించారట. ప్రమాదం సమయంలో దిగంత్ భార్య ఐంద్రిత కూడా ఉన్నారు. ఐంద్రిత కూడా పలు కన్నడ సినిమాల్లోను, హిందీ సినిమాల్లో నటించారు. దిగంత్ తెలుగు సినిమా వాన లో గెస్ట్ పాత్రలో కనిపించారు.




























