Dil Raju: తొలిసారి కొడుకుని చూసి మురిసిపోతున్న దిల్ రాజు.. విలువైన క్షణాలంటూ పోస్ట్?
Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ విధంగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు తాజాగా తండ్రి అయిన సంగతి మనకు తెలిసిందే. దిల్ రాజు రెండవ భార్య తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఈమె మగ బిడ్డకు జన్మనివ్వడంతో దిల్ రాజుకు వారసులు లేరు అనే లోటు తీరిపోయింది.
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఆమెకు కూడా పిల్లలు కావడంతో దిల్ రాజు తాతయ్యారు.ఈ విధంగా దిల్ రాజు తాత అయిన తర్వాత మరోసారి తండ్రి కావడం ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తన తల్లి మరణించడంతో తన తండ్రికి తోడు కావాలని దిల్ రాజుకు కూతురు దగ్గరుండి వీరి వివాహం చేశారు.
ఈ విధంగా అతి కొద్ది మంది సమక్షంలో దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు కుమారుడు జన్మించడంతో పెద్ద ఎత్తున దిల్ రాజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.అయితే హాస్పిటల్లో మొదటిసారిగా దిల్ రాజు తన కుమారుడిని చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విలువైన క్షణాలు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ వీడియోలో వైరల్ గా మారింది.
ఇక ఈ ఫోటో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అలాగే మరికొందరు దిల్ రాజు ప్రస్తుతం వారసుడు అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా చేసే సమయంలోనే ఈయన ఇంటికి కూడా వారసుడు రావడం విశేషం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరికొందరు మాత్రం తాత అయిన తర్వాత తండ్రి కావడం ఏంటి అంటూ దిల్ రాజు పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…