Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. దిల్ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా మారిన రాజు ఆ సినిమాని తన పేరుగా చేసుకొని దిల్ రాజుగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా సినిమా థియేటర్ల విషయంలో వివాదాలు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వారసుడు సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు థియేటర్లో కేటాయించామని కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని నిర్మాతల మండలి వెల్లడించింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు సినిమా థియేటర్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా అనేది ఒక వ్యాపారం.. ప్రస్తుతం నేను తమిళ హీరో తో తీసిన సినిమా విడుదల చేయడానికి థియేటర్ల కోసం ప్రయత్నిస్తున్నాను అని వెల్లడించాడు.
సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమాకి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు పోటీగా నిలుస్తున్నాయి. ఇక తమిళ్ భాషలో అజిత్ నటించిన సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ జరగనుంది. ఈ క్రమంలో ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ కన్నా విజయ్ కి ఎక్కువ పాపులారిటీ ఉంది. అందువల్ల మాకు మరొక 50 థియేటర్లు ఎక్కువగా కావాలని అడుక్కుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు.
చెన్నైలో మొత్తం ఎనిమిది వందల థియేటర్లో ఉండగా వీరికి సగం కేటాయించారు. అయితే విజయ్ పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని మరొక 50 థియేటర్లు ఎక్కువ కేటాయించమని దిల్ రాజు ఆ సినిమా నిర్మాతలను వేడుకోనున్నాడు. అజిత్ నటిస్తున్న సినిమాని ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నాడు. నేను ఆయన్ని కలిసి మాట్లాడుతానని దిల్ రాజు అన్నారు. అయితే అజిత్ కన్నా విజయ్ పెద్ద స్టార్ హీరో అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి. అజిత్ ని తక్కువ చేస్తూ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వివాదం చెలరేగేలా ఉంది. అజిత్ పాపులారిటీ గురించి దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…