Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శౌర్య’ సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయితగా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ప్రభాస్, మనోజ్ ఇప్పటికీ నాకు టచ్ లో ఉంటారు…
దశరథ్ గారు తన సినిమాలు కొన్ని ఫ్లాప్ అవడానికి గల కారణాలను చెబుతూ కథ దగ్గర కంప్రమైస్ అవ్వడం వల్లే కొన్ని సినిమాలు పోయాయని అది నా తప్పే అంటూ చెప్పారు. ఇక మనోజ్ తో రెండు సినిమాలు చేయగా రెండూ ఫ్లాప్ అవడం బాధగా అనిపించింది.
నేను సినిమాలు చేసిన హీరోల్లో మనోజ్, ప్రభాస్ ఇద్దరితోనూ ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. వాళ్లిద్దరూ నాకు బాగా ఇష్టం. ఇక మనోజ్ అంటే చాలా ఇష్టం.. తన అల్లరి ఆ ఎనర్జీ బాగా నచ్చుతాయి. నాకు కొడుకు పుడితే మనోజ్ లాంటి వాడు పుట్టాలని అనుకునేవాడిని అంటూ ఆ హీరోలతో ఉన్న అనుబంధం గురించి దశరథ్ గారు చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…