Director Krishna Vamsi : ఖడ్గం సినిమా టైటిల్ విషయంలో… సీత రామ శాస్త్రి గారికి ఒకటే చెప్పా…: దర్శకుడు కృష్ణవంశీ

0
141

Director Krishna Vamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో రంగమార్థండ అనే సినిమాతో మరోసారి వచ్చారు. ఇక తన కెరీర్ కే మైలు రాయిలాగా నిలిచిన ఖడ్గం సినిమాకి సంబంధించిన అనేక విషయాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఖడ్గం సినిమాకు టైటిల్ ఎలా పెట్టమంటే….

కృష్ణవంశీ సినిమా కెరీర్ లో ఒక అద్భుతమైన సినిమా ఖడ్గం. జెండా రంగులను ఆధారంగా ముగ్గురు వ్యక్తుల మధ్య రిలేషన్ పెట్టి సినిమాను అద్భుతంగా డ్రైవ్ చేసాడు కృష్ణవంశీ . అయితే మొదట ఆటో డ్రైవర్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణ సినిమాలంటే పిచ్చి ఉండే కోటి ఇలా మూడు క్యారెక్టర్స్ ను అనుకుని వారి చుట్టూ కథ అల్లే క్రమంలో స్లీపర్ సెల్స్ గురించి అపుడే కొత్తగా హైదరాబాద్ లో వినిపించడం తీవ్రవాదులను తప్పించడానికి శిక్షణ తీసుకుని వచ్చే స్లీపర్ సెల్స్ ను సినిమాలో భాగం చేస్తూ కథ అల్లేసుకున్నాడట కృష్ణ వంశీ.

అయితే కథ అంత రెడీ అయి స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నపుడు సీతారామశాస్త్రి గారికి కథ చెప్పి చర్చిస్తుండగా టైటిల్ గురించి ప్రస్తావన వచ్చి జెండా కోసం కత్తి దూసే వాడిలాగ టైటిల్ ఉండాలి అని ఆలోచిస్తూ కత్తి అని పెడితే బాగోదు కాబట్టి ఖడ్గం అని పెడదాం అని ఇద్దరు అనుకున్నారట. అలా ఖడ్గం సినిమా టైటిల్ వచ్చిందంటూ కృష్ణ వంశీ తెలిపారు.