Director Krishnavamsi : సున్నిత అంశాలతో భావోద్వేగాన్ని చూపిస్తూ సినిమాల్లో సహజంగా అనుబంధాలను చూపించే దర్శకుడు తెలుగులో కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఆయన తీసిన సింధూరం, ఖడ్గం వంటి సినిమాలు మొదలు నిన్నేపెళ్లాడతా ,మురారి వంటి సినిమాల వరకు అన్ని ప్రేక్షకులను కట్టిపడేసాయి. అలాంటి కృష్ణ వంశీ చాలా కాలంగా మెగా ఫోన్ కి దూరంగా ఉంటున్నాడు. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో రంగమార్థండ అనే సినిమాతో మరోసారి వచ్చారు. ఇక తన కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఆ పాత్ర బాలకృష్ణని ఉద్దేశించి కాదు….
కృష్ణ వంశీ సినిమాల్లో అన్నిటికన్నా ముందు గుర్తొచ్చే సినిమా ఖడ్గం. దేశభక్తికి సంబంధించిన ఈ సినిమా లో సినిమా ఇండస్ట్రీ లోని కష్టాలను కూడా టచ్ చేసాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. హీరోయిన్ అవ్వాలనుకున్న సంగీత క్యాస్టింగ్ కౌచ్ కి బలవ్వడం అలాగే నటన రాని వాడు హీరోగా ఉండటం వంటివి చూపించాడు. ఆ సినిమాలోని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పాత్ర ద్వారా కమెడియన్ పృథ్వీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుని సెటిల్ అయ్యాడు. అయితే ఆ పాత్ర బాలకృష్ణ ని ఉద్దేశించి పెట్టినట్లుగా అప్పట్లో రూమర్స్ రాగా వాటి మీద కృష్ణ వంశీ క్లారిటీ ఇచ్చారు.

ఎవరిని ఉద్దేశించి ఆ పాత్ర పెట్టలేదని సినిమాలోని పాత్ర డైలాగులు చెప్పడానికి రాక ఇబ్బంది పడతాడు. కానీ బాలకృష్ణ గారికి డైలాగులు చెప్పడం బాగా వస్తుంది కదా మరి ఆయన గురించి అని ఎలా అనుకుంటారు. కావాలనే కొంతమంది వారి గురించి అని బయటికి వస్తుందనే భయంతో అలా ఆయన మీదకు నెట్టి ఉండవచ్చు కానీ నేను ఎవరిని ఉద్దేశించి ఇండస్ట్రీ లోని కష్టాలను సినిమాలో పెట్టలేదు. కానీ కొంత మంది పగబట్టి మరి నా మీద పగ తీర్చుకున్నారు. నన్ను ఇండస్ట్రీ లో తొక్కేసారు ఇబ్బందులకు గురిచేసారు అంటూ కృష్ణ వంశీ తెలిపారు.