“ఇస్మార్ట్ శంకర్” సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, అదే సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టారు. మరోవైపు హీరోయిన్ గా చార్మి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, చార్మి కలిసి ఇటీవలే “ఇస్మార్ట్ శంకర్” సినిమాని నిర్మించి భారీ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. “ఇష్మార్ట్ శంకర్” ఇచ్చిన సక్సెస్ తో అదే జోష్ లో విజయ దేవరకొండతో “ఫైటర్” చిత్రాన్ని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ కం నిర్మాత పూరి జగన్నాథ్. ఈ సినిమా షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా ఇపుడు ఈ సినిమాకి సంబందించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది.
విజయ దేవరకొండ హీరోగా వస్తున్న “ఫైటర్” మూవీలో హీరోగా మొదట అల్లు అర్జున్ ను తీసుకుందాం అనుకున్నారట పూరి మరియు చార్మి. ఈ విషయంపై బన్నీని సంప్రదించగా కొన్ని కారణాల దృష్ట్యా ఈ చేయడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వత చేసిది ఏమి లేక ఫైటర్ సినిమాకి విజయ్ అయితే బాగుంటుంది అని, మన రౌడీని సంప్రదించగా పూరి చెప్పిన కథ నచ్చి విజయ్ వెంటనే ఒకే చెప్పాడట. అలా ఫైటర్ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటించడం జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించ బోతున్నారు అని సమాచారం.
ఎక్కువ మాస్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయడం పూరికున్న ప్రత్యేకత గా చెప్పుకుంటారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి తో మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన రౌడీని ఇంకెంత మాస్ లుక్ లో చూపిస్తాడో అని విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఫైటర్ లో మాస్ కి రొమాన్స్ ను కూడా జోడించి ఇటు క్లాస్ ఆడియన్స్ అటు మాస్ ఆడియన్స్ అని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్. అంతే కాకుండా పూరి మరియు చార్మి కౌర్ బ్యానర్ కి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా తోడవడంతో ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…