Director Sagar:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిన్నటి తరం దర్శకులలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి.ఈయన దర్శకత్వంలో వచ్చిన రామసక్కనోడు సినిమాకు గాను ఏకంగా మూడు నంది అవార్డులు వచ్చాయి. ఈ విధంగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విద్యాసాగర్ రెడ్డి అనంతరం నిర్మాతగా మారారు. ఇలా ఈయన డైరెక్టర్ గా సక్సెస్ అయిన విధంగా నిర్మాతగా సక్సెస్ కాలేకపోయారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి గతంలో ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాస్ రావు పై తాను కోప్పడిన సందర్భాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే సాగర్ మాట్లాడుతూ తాను కోట శ్రీనివాసరావుతో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆయన బంధువులు ఎవరో చనిపోయారు ఇలా షూటింగ్ జరగాల్సి ఉండగా తాను రాలేనని ఇలా తన బంధువులు చనిపోయారని చెప్పారు.
ఇక తను చెప్పిన డేట్ ప్రకారమే తిరిగి షూటింగ్ ప్రారంభించాము ఆరోజు సెట్ లో అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన మాత్రం రాలేదు. ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి మరొక రోజు షూటింగ్ పెట్టుకున్న కోటా రాలేదు. దీంతో ఆయన దగ్గరకు వెళ్లి ఏంటి కోట షూటింగ్ కు వస్తారా? రారా ? నాలో మరో యాంగిల్ చూడొద్దు అంటూ తనని అరిచాను. అయితే అనంతరం ఆయన షూటింగ్లో పాల్గొని ఆ సినిమా పూర్తి చేసుకున్నారు.
ఇకపోతే ఎమ్మెస్ నారాయణ పై కూడా ఒకసారి ఏకంగా చేయి చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సాగర్ తెలిపారు.ఓ సినిమా షూటింగ్ నిమిత్తం సాయంత్రం ఆయన వెళ్లాల్సి ఉండగా లొకేషన్ లోనే మందు తాగుతూ కూర్చున్నారు. అయితే నిర్మాత తనకు ఓ పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది.దీని గురించి మాట్లాడుతూ నిర్మాతలను బండబూతులు తిట్టడమే కాకుండా వీళ్ళు ఇలాగే అంటారు కానీ ఇవ్వరు అంటూ మాట్లాడారు. ఆ మాట విన్న నేను వెళ్లి చెంప చెల్లుమనిపించాను.అయితే తనని కొట్టిన కొన్ని నిమిషాలకే నిర్మాత మనిషి వచ్చి డబ్బు ఇచ్చారు. అంటూ ఈ సందర్భంగా సాగర్ అప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…