Featured

Disco Shanti : ఘరానా మొగుడు సినిమా “బంగారు కోడిపెట్ట” పాటలో డాన్స్ 10% కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేసిన డిస్కో శాంతి !

Disco Shanti : డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్యతార. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఈమె చెల్లెలు లలిత కుమారి తమిళ సినిమారంగంలో కథానాయకి, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య, ఈ దంపతులు 2009లో విడాకులు తీసుకున్నారు. ఈమె తండ్రి సి.ఎల్. ఆనందన్ అలనాటి తమిళ సినిమా నటుడు. డిస్కోశాంతి “విజయపురి వీరన్ కట్టుమల్లిక ” వంటి అనేక చిత్రాలలో నటించిన తమిళ నటుడు సిఎల్ ఆనందన్ కుమార్తె.

ఆమెకు ఒక చెల్లెలు, నటి లలిత కుమారి. డిస్కో శాంతి 1996లో తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబం ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను ప్రారంభించింది, ఇది గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని విద్యార్థులకు పాఠశాల సామాగ్రితో సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉంది. వారు మేడ్చల్‌లోని నాలుగు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న శ్రీ హరి, ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ సమయంలో తలతిప్పినట్లు చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే అప్పట్లో “ఘరానామొగుడు” చిత్రంలో మీరు చేసిన ఆ ఒక్క పాట దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. ఆ పాటలో మీరు చిరంజీవితో సరి సమానంగా డాన్స్ చేశారంటూ యాంకర్ అనడంతో… దానికి సమాధానంగా డిస్కోశాంతి మాట్లాడుతూ.. అయ్యో చిరంజీవితో సమానంగా డాన్స్ చేయడమా అదేమీ లేదంటూ… ఆయన డాన్స్ లో నేను చేసింది టెన్ పర్సెంట్ కూడా ఉండదని.. ఆయనను నేను పప్పా(నాన్న) అని పిలుస్తానని.. ఎందుకంటే మద్రాసులో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా చిరంజీవి మేనేజర్ వెంకన్నబాబు ఇల్లు ఉండేదని అక్కడికి తరచూ చిరంజీవి వస్తూ ఉండేవారని నేను ఫోర్త్ క్లాస్ నుంచే చిరంజీవిని గమనిస్తూ ఉండే దాన్ని ఆయన కనిపించిన ప్రతిసారి మా నాన్నలా ఉన్నారంటూ మా ఇంట్లో అనేదాన్ని ఆయనను ఘరానా మొగుడు రౌడీ అల్లుడు సినిమా షూటింగ్ సమయంలో కూడా పప్పా అని పిలుస్తుండేదాన్ని అలా చిరంజీవితో గల అనుబంధాన్ని గురించి ఆ ఇంటర్వ్యూలో డిస్కోశాంతి చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago