Disco Shanti : డిస్కో శాంతి 1980వ దశకపు ప్రముఖ తెలుగు శృంగార నృత్యతార. ఈమె తెలుగు సినీరంగంలో రియల్ హీరోగా పేరుతెచ్చుకున్న శ్రీహరిని ప్రేమించి, పెళ్ళి చేసుకున్నది. ఈమె చెల్లెలు లలిత కుమారి తమిళ సినిమారంగంలో కథానాయకి, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మొదటి భార్య, ఈ దంపతులు 2009లో విడాకులు తీసుకున్నారు. ఈమె తండ్రి సి.ఎల్. ఆనందన్ అలనాటి తమిళ సినిమా నటుడు. డిస్కోశాంతి “విజయపురి వీరన్ కట్టుమల్లిక ” వంటి అనేక చిత్రాలలో నటించిన తమిళ నటుడు సిఎల్ ఆనందన్ కుమార్తె.

ఆమెకు ఒక చెల్లెలు, నటి లలిత కుమారి. డిస్కో శాంతి 1996లో తెలుగు నటుడు శ్రీహరిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేసింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబం ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను ప్రారంభించింది, ఇది గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత నీటిని విద్యార్థులకు పాఠశాల సామాగ్రితో సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉంది. వారు మేడ్చల్‌లోని నాలుగు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న శ్రీ హరి, ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్‌కుమార్ షూటింగ్ సమయంలో తలతిప్పినట్లు చెప్పారు. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే అప్పట్లో “ఘరానామొగుడు” చిత్రంలో మీరు చేసిన ఆ ఒక్క పాట దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. ఆ పాటలో మీరు చిరంజీవితో సరి సమానంగా డాన్స్ చేశారంటూ యాంకర్ అనడంతో… దానికి సమాధానంగా డిస్కోశాంతి మాట్లాడుతూ.. అయ్యో చిరంజీవితో సమానంగా డాన్స్ చేయడమా అదేమీ లేదంటూ… ఆయన డాన్స్ లో నేను చేసింది టెన్ పర్సెంట్ కూడా ఉండదని.. ఆయనను నేను పప్పా(నాన్న) అని పిలుస్తానని.. ఎందుకంటే మద్రాసులో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా చిరంజీవి మేనేజర్ వెంకన్నబాబు ఇల్లు ఉండేదని అక్కడికి తరచూ చిరంజీవి వస్తూ ఉండేవారని నేను ఫోర్త్ క్లాస్ నుంచే చిరంజీవిని గమనిస్తూ ఉండే దాన్ని ఆయన కనిపించిన ప్రతిసారి మా నాన్నలా ఉన్నారంటూ మా ఇంట్లో అనేదాన్ని ఆయనను ఘరానా మొగుడు రౌడీ అల్లుడు సినిమా షూటింగ్ సమయంలో కూడా పప్పా అని పిలుస్తుండేదాన్ని అలా చిరంజీవితో గల అనుబంధాన్ని గురించి ఆ ఇంటర్వ్యూలో డిస్కోశాంతి చెప్పుకొచ్చారు.






























