Categories: FeaturedGeneral News

డబ్బు కోసం కాదు నచ్చిన పని చెయ్యి.. డబ్బు తనంతట తానే వస్తుంది!

సాధారణంగా ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆడపిల్లలు వయసురాగానే బురఖా లేనిదే ఇంటి నుంచి బయటకు రారు. వారి ఇళ్లలో ఎన్నో కఠిన నియమాలు ఉంటాయి. అయితే ఈ నియమాలను, ఈ వస్త్రధారణను పూర్తిగా మార్చాలని 15 సంవత్సరాలకే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా ముందుకు వచ్చి అంతటితో ఆగకుండా ప్రతిరంగంలోనూ వ్యాపారాలను మొదలుపెడుతూ 34 సంవత్సరాలకే అంతర్జాతీయ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపును సంపాదించుకుంది సారా అల్‌ మదానీ .

15 సంవత్సరాలకే వ్యాపార రంగంలోకి వచ్చిన సారా ఆ ఆ తర్వాత రెస్టారెంట్లను ప్రారంభించాలానే ఆలోచన చేసింది.ఈ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టకపోతే తనకు రావాల్సిన గుర్తింపు మరొకరికి దక్కుతుందని భావించి వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. లాభనష్టాలతో పని లేకుండా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని చెబుతుంది.

సారా ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ సాంకేతిక రంగం మగవారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన మాటలను విన్న ఆమె తనలో మరింత పట్టుదలను పెంపొందించుకుని సాఫ్ట్ వేర్ కంపెనీలను ప్రారంభించింది. సోషల్‌ఫిష్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో సంస్థలకు ప్రచారం కల్పించే, సంస్థలనూ స్థాపించింది సారా. మనం చేసే ఏ పనిలో నైనా ధైర్యంతో, పని పై గౌరవంతో ముందుకు వెళ్లడమే గెలుపు మంత్రమంటోంది.

ఈ క్రమంలోనే యూఏఈ ప్రభుత్వం సారాను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాల కౌన్సిల్‌ బోర్డు సభ్యురాలిగా నియమించింది. తను ఈ వ్యాపారాలలో విధంగా ముందుకు రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని తెలిపారు. వృత్తి పరంగా అమ్మ టీచర్ కావడం నాన్న ఇంజనీర్ కావడంతో వారి ప్రోత్సాహం తనకు ఎప్పుడూ ఉండేది. “డబ్బు కోసం కాదు నచ్చిన పని చెయ్యి డబ్బు తనంతటతానే వస్తుందని” తన తండ్రి ఎప్పుడూ తనకి చెప్పేవారని అదే నా గెలుపు మంత్రం అని ఈ సందర్భంగా సారా తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago