సాధారణంగా ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆడపిల్లలు వయసురాగానే బురఖా లేనిదే ఇంటి నుంచి బయటకు రారు. వారి ఇళ్లలో ఎన్నో కఠిన నియమాలు ఉంటాయి. అయితే ఈ నియమాలను, ఈ వస్త్రధారణను పూర్తిగా మార్చాలని 15 సంవత్సరాలకే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా ముందుకు వచ్చి అంతటితో ఆగకుండా ప్రతిరంగంలోనూ వ్యాపారాలను మొదలుపెడుతూ 34 సంవత్సరాలకే అంతర్జాతీయ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపును సంపాదించుకుంది సారా అల్ మదానీ .

15 సంవత్సరాలకే వ్యాపార రంగంలోకి వచ్చిన సారా ఆ ఆ తర్వాత రెస్టారెంట్లను ప్రారంభించాలానే ఆలోచన చేసింది.ఈ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టకపోతే తనకు రావాల్సిన గుర్తింపు మరొకరికి దక్కుతుందని భావించి వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. లాభనష్టాలతో పని లేకుండా ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని చెబుతుంది.
సారా ఓ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ సాంకేతిక రంగం మగవారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పిన మాటలను విన్న ఆమె తనలో మరింత పట్టుదలను పెంపొందించుకుని సాఫ్ట్ వేర్ కంపెనీలను ప్రారంభించింది. సోషల్‌ఫిష్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో సంస్థలకు ప్రచారం కల్పించే, సంస్థలనూ స్థాపించింది సారా. మనం చేసే ఏ పనిలో నైనా ధైర్యంతో, పని పై గౌరవంతో ముందుకు వెళ్లడమే గెలుపు మంత్రమంటోంది.
ఈ క్రమంలోనే యూఏఈ ప్రభుత్వం సారాను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాల కౌన్సిల్ బోర్డు సభ్యురాలిగా నియమించింది. తను ఈ వ్యాపారాలలో విధంగా ముందుకు రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని తెలిపారు. వృత్తి పరంగా అమ్మ టీచర్ కావడం నాన్న ఇంజనీర్ కావడంతో వారి ప్రోత్సాహం తనకు ఎప్పుడూ ఉండేది. “డబ్బు కోసం కాదు నచ్చిన పని చెయ్యి డబ్బు తనంతటతానే వస్తుందని” తన తండ్రి ఎప్పుడూ తనకి చెప్పేవారని అదే నా గెలుపు మంత్రం అని ఈ సందర్భంగా సారా తెలిపారు.



























