పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నిమ్మరసాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మరసం వల్ల శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ నిమ్మరసం తీసుకునే వారిలో నిమ్మలో ఉండే యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లు నిమ్మరసం తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
నిమ్మరసం చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని నియంత్రించడంతో పాటు పంటినొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం శరీరంలో కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సులభంగా తొలగిస్తుంది. రోజూ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగేవారు బరువు సులభంగా తగ్గవచ్చు. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలోని చిన్నచిన్న రాళ్లను సైతం కరిగించగలుగుతుంది.
అలసటతో బాధ పడుతున్న వారు నిమ్మరసం తాగితే తక్కువ సమయంలోనే వారికి శక్తి లభిస్తుంది. అయితే నిమ్మరసం సాధారణంగా తాగితే ఎంత మేలు జరుగుతుందో నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. నిమ్మరసం నీటిలో కలిపి ఎక్కువసార్లు తాగితే దంతాలు దెబ్బ తినే అవకాశం ఉంది. దంతాల పై పొర అయిన ఎనామిల్ ను నిమ్మరసం దెబ్బ తీస్తుంది.
ఎక్కువగా నిమ్మరసం తాగే వారిలో అల్సర్, అసిడిటీ సమస్యలు వస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశొధనల్లో తేలింది. వైద్యులు నిమ్మరసం ఎక్కువగా తాగే వారికి మూత్ర సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ప్రతిరోజూ నిమ్మరసం తాగితే నాలుకపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా నిమ్మరసం తాగితే మైగ్రేన్ సమస్య బారిన పడే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…