Deepthi-Shanmukh: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ప్రస్తుతం అందరి మదిలో బిగ్ బాస్ 6 ఎప్పుడనే ప్రశ్నే ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్5 విన్నర్ వీజే సన్నీనే అయినా.. రన్నరప్ షణ్మఖ్ జశ్వంత్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ లో చివరి వరకు పోటీ ఇచ్చిన షణ్ముఖ్.. సిరి కారణంగా వెనకబడిపోయాడు.
ఫలితంగా ట్రోఫీకి దూరం అయిపోయాడంటూ.. ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. సిరితో మితిమీరిన రొమాన్స్ కారణంగా నెగిటివిటీని మూటకట్టుకున్నాడు. దీంతో రన్నరప్ గానే నిలిచాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బయటకి సిరి- షన్నూలు ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం వీరిద్దరి మధ్య కిస్సింగులు, కౌగిలించుకోవడాలు చూస్తే వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కన్నా వేరే రిలేషన్ ఏదో ఉందనే అనుమానాలు వెల్లువెత్తాయి.
సిరికి ఆల్రెడీ శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ అవ్వడం… షన్నూ, దీప్తి సునయనతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే హౌజ్ లో మాత్రం సిరి, షన్నూకు మధ్య రొమాన్స్ మాత్రం పీక్స్ లో ఉండటం చూసి చాలామంది చాలా విధాలుగా ట్రోలింగ్ చేశారు. అయితే తాజాగా షణ్ముఖ్ ఇన్ స్టా లైవ్ సెషన్ నిర్వహించాడు. దీంట్లో అభిమానులు దీప్తి సునయన గురించే ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
దీంతో షన్నూ కూడా ఈ విషయంపై స్పందించాడు. ప్రస్తుతం తనని దీపు బ్లాక్ చేసిందని.. త్వరలోనే వెళ్లి కలుస్తా అని వెల్లడించాడు. దీపు నావల్ల ఎక్కువగా బ్యాడ్ అయిందని.. అయినప్పటికీ నాకోసం నిలబడిందన్నాడు షన్నూ. తప్పకుండా వెళ్లి మాట్లాడుతా అన్నాడు. ఇక తనతో బ్రేకప్ అయితే జరగదని.. నాచేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలనని స్పష్టం చేశాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్ సైతం కంటిన్యూ అవుతుందని వెల్లడించాడు. జెస్సీ, సిరి తనకు మంచి ప్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు షణ్ముఖ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…