Shanmukh-Jaswanth: యూట్యూబర్ గా, వెబ్ సిరీస్ లో నటించి ఎంతో పాపులారిటీ దక్కించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. బిగ్ బాస్ కి వెళ్లక ముందు తన గురించి ఎంతో పాజిటివ్ ఉన్న వారిలో కూడా ఈ కార్యక్రమం ద్వారా నెగిటివిటీ ఏర్పరచుకొని బయటికి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తప్పకుండా బిగ్ బాస్ అందుకుంటారని చాలామంది భావించారు.
అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేక పోయారు దీంతో పెద్దఎత్తున షణ్ముఖ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆయన బిగ్ బాస్ ట్రోఫీకి కూడా దూరమయ్యారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి షాక్ అయినట్లు తెలిపారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు.అక్కడ జరిగే 24 గంటలలో కేవలం గంట మాత్రమే టెలికాస్ట్ అవుతుందని ఆ గంట వల్ల వారికి చాలా నెగిటివిటీ వచ్చిందని తెలిపారు.
అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి తాను ఏం నేర్చుకోలేదని కేవలం నెగిటివిటీ ని మాత్రమే మూటకట్టుకుని బయటకు వచ్చానని తెలిపారు. అక్కడ అ మనం ఏది చేస్తే అదే కరెక్టు అనే భావనలో ఉంటాము. ఎవరు ఏం చెప్పినా మనమే కరెక్ట్ అనే భావన ఉండటం వల్ల పరిస్థితి ఇంతవరకు వచ్చిందని, ఇది మంచి ఇది చెడు, బయట ఇలా జరుగుతుందని చెప్పే వాళ్ళు లేరు కనుక అక్కడ మనం ఏం చేస్తే అదే కరెక్ట్ అనిపిస్తుందని ఈ సందర్భంగా షణ్ముఖ్ జస్వంత్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…