Sukumar-Pushpa: పుష్ప సినిమా వర్కర్లందరికీ..! డైరెక్టర్ సుకుమార్ ఎంత ఇచ్చాడో తెలుసా.?
Sukumar-Pushpa: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే రూ. 100 కోట్లను వసూళ్లను క్రాస్ చేసింది. ప్యాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మూవీ అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. తగ్గేదే లే అన్న రీతిలో వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది. సినిమాకు ముందే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద హిట్ అయింది. దీంతో పాటు సమంత ఐటెం సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. తాజాగా పుష్ప సినిమా యూనిట్ థాంక్స్ మీట్ లలో పాల్గొంటుంది. తాజా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుకుమార్ ఎమోషనల్ అయ్యారు.
ముందుగా బన్నీ మాట్లాడుతూ.. సుకుమార్ లేకుంటే స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ లేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. దీంతో సుకుమార్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. పుష్ప సక్సెస్ లో తన భార్యకు కూడా పరోక్షంగా కారణం అంటూ.. సుకుమార్ తన భార్య గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆ తరువాత.. సినీ గేయరచయిత చంద్రబోస్ కాళ్లను మొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు సుకుమార్.
ఇదిలా ఉంటే సుకుమార్ తన టీంకు బంఫర్ ఆఫర్ ప్రకటించాడు. తన టీంకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించారు. సుకుమార్ మాట్లాడుతూ.. ప్రొడక్షన్ బాయ్స్, సెట్ బాయ్స్ ఇలా అందరిని కష్టపెట్టానని తెలుసని సుకుమార్ వారి గురించి మాట్లాడారు. ఆర్య దగ్గర నుంచి రంగా బ్యాచ్ అని ఒకటి ఉందని… 24 గంటలు ఆలోచించవచ్చు కానీ.. 24 గంటలు పనిచేస్తూ ఉండగలమా అని ప్రశ్నించారు. ఈ విధంగా బండలెత్తుతూ వారంతా పనిచేశారని తెలిపారు. సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ కి, లైట్ మెన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని సుకుమార్ ప్రకటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…