సామాజిక మాధ్యమాలలో ఒకటైన ఇంస్టాగ్రామ్ లో రోజురోజుకు ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్
ఇన్‌ఫ్లుయెన్సర్ల నెల సంపాదన ఎంత ఉంటుందని ఆలోచన.. ఈ సందేహం చాలా మందికి కలిగి ఉంటుంది. అయితే వీరి నెల సంపాదన తెలిస్తే మాత్రం ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతారు.
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను ఒక చిన్న సెలబ్రిటీలుగా వర్ణించవచ్చు.వీరిలో ఉండే వివిధ నైపుణ్యాలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటారు. అయితే ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే వారికి అంత ఎక్కువ సంపాదన వస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంస్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుకుంటారు.
ఈ అధ్యయనంలో భాగంగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కి వెయ్యి నుంచి 10 వేల మంది ఫాలోవర్స్ ఉంటే వారి నెల సంపాదన1,420 డాలర్లు వస్తుంది. అదేవిధంగా పది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న వారికి నెలకు ఆదాయం
15,356 డాలర్లు సంపాదిస్తారు.ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వారికి అంత ఎక్కువ ఆదాయం వస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లు వారు కొనసాగుతున్న రంగం ఆధారంగా వారి నెలసరి ఆదాయం ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఉదాహరణకు ఒక బ్యూటీ రంగంలో పనిచేసే వారు ఒక గంటకు 60 డాలర్లు సంపాదిస్తే ఇంకో రంగానికి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ గంటకు 187 డాలర్లు సంపాదిస్తాడని చెప్పవచ్చు ఈవిధంగా వారి రంగం బట్టి వారి ఫాలోవర్స్ ని బట్టి వారికి నెలసరి ఆదాయం వస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. మొత్తానికి ఇంస్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు లక్షలలో ఆదాయం పొందుతున్నారని చెప్పవచ్చు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…