గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి బాధితులను ఎన్నో సమస్యలకు గురిచేస్తుంది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి.తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న బాధితులలో మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనంలో నిపుణులు వెల్లడించారు.
కరోనా వైరస్ మన శరీరంలోకి వ్యాప్తి చెందగానే శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపినట్టే మెదడుపై కూడా ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అధ్యయనంలో భాగంగా కరోనా సోకిన బాధితులు క్రమంగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం, ఏదైనా ఒక పని పై శ్రద్ధ చూపకపోవడం, తీవ్రమైన గందరగోళం అధిక తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఈ విధమైనటువంటి లక్షణాలు కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత బాధితులలో తలెత్తుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ విధంగా వైరస్ శరీరంలో ఇతర భాగాల పై దాడి చేసినట్లు మెదడుపై ప్రభావితం చేసే మార్గాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. వైరస్ మన శరీర భాగాలలోకి వ్యాపించినట్లు మెదడులోకి చొరబడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి మెదడు సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు.
ఈ వైరస్ కారణంగా శరీరంలో ఎదురయ్యే శారీరక మార్పులు కారణంగా మెదడు పని చేయక పోవడానికి కారణం అవుతుందని తెలిపారు. ఇలా పలు కారణాల చేత కరోనా నుంచి కోలుకున్న తరువాత కొందరిలో ఈ విధమైనటువంటి మెదడు సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయని నిపుణులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…