Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ కారుకు పెద్దపులి ఎదురైతే… ఎన్టీఆర్ స్పందన ఎలా ఉందో తెలుసా?
Sr.NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో అద్భుతంగా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన నటుడిగా అందరికీ సుపరిచితమే. సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన దేవత సినిమా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుందని ఆ సంఘటన గురించి తాజాగా బయటపడింది.
ఈ సినిమాలోని “కన్నుల్లో మిసమిసలు”అనే పాటను చిత్రీకరించడం కోసం చిత్రబృందం సాతనూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తారక రామారావు పద్మనాభం ఒక కారులో రాత్రి 9 గంటలకు మద్రాసు నుంచి బయలుదేరారు. తిరువణ్ణామలై మీదుగా సాతనూరు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తనకు నిద్ర వస్తుందని తిరువణ్ణామలై రాగానే తన నిద్ర లేపమని చెప్పి వెనుక సీట్ లో పడుకున్నారు.
ఈ విధంగా తిరువణ్ణామలై రాగానే పద్మనాభం ఎన్టీఆర్ ను నిద్ర లేపితే ఎన్టీఆర్ కారు దిగి కాసేపలా తిరిగిన తర్వాత వెళ్దాం పదండి బ్రదర్ అంటూ సాతనూరుకి తిరిగి వెళ్లారని తెలిపారు.ఇలా కారులో వెళ్తున్న సమయంలో పద్మనాభం మాట్లాడుతూ అన్నగారు మీరు నిద్రపోతున్న సమయంలో ఒక సంఘటన చోటుచేసుకుంది ఆవిషయం నీకు చెప్పాలి అంటూ తెలియజేశారు.
ఈ మాట విన్న ఎన్టీఆర్ ఏం జరిగింది బ్రదర్ అని అడగగా మీరు నిద్రపోతున్న సమయంలో చెంగల్పట్టు వద్దకు వెళ్లగానే ఒక పెద్ద పులి కారుకు ఎదురుగా వచ్చిందని తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్ అరెరే… నన్ను నిద్ర లేపాల్సింది బ్రదర్ పులి ఎదురు రావడం శుభశకునం అని అన్నారు.మీరు నిద్ర లేపవద్దు అని చెప్పడంతో లేప లేదని ఆ పులి ఎదురుగా వస్తుంటే డ్రైవర్ గజగజ వణికి పోయారని నేను కూడా పైకి గంభీరంగా కనిపిస్తుంది లోపల వణుకు పుట్టిందని పద్మనాభం తెలిపారు. ఆయన ఎదురుగా పులి వస్తే మాకేం భయం లేదు మా వెనక సింహం నిద్రపోతుంది అనే ధైర్యం ఉంది అంటూ పద్మ నాభం చెప్పడంతో వెంటనే ఎన్టీఆర్ వెరీ గుడ్ బ్రదర్ అంటూ భుజం మీద చేయి వేసి తట్టారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…