Pushpa-Anasuya: పుష్పలో అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. 10 రోజులకు అంత అమౌంటా..?
Pushpa-Anasuya: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప వసూళ్లలో దుమ్మురేపుతోంది. అన్ని భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో బన్నీ ఊర మాస్ లుక్కులో.. ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తుండటంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. .
అందుకు తగ్గట్లుగానే విడుదలైన తర్వాత అన్ని సెంటర్లలో పుష్ప హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ మ్యాజిక్ తో పాటు సమంత ఐటెం సాంగ్ పుష్పకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే మరో క్యారెక్టర్ ద్రాక్షాయణిగా హాట్ యాంకర్ అనసూయ మంచి క్యారెక్టర్ చేసింది.
రంగమత్తగా రంగస్థలంలో అందర్ని మెప్పించిన పాత్రలో ఒదిగిపోయిన అనసూయ.. పుష్పలో ద్రాక్షాయణిగా.. మంగళం శ్రీను భార్యగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించింది.
అయితే ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఎంత పారితోషకం తీసుకున్నదనేది ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. అయితే అనసూయ దాదాపుగా రోజుకు రూ. 1-1.5 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఆమె పుష్ప సినిమా కోసం దాదాపు 10 రోజుల దాకా కాల్షీట్లు ఇచ్చిందట.. ఈ లెక్కన ఆమెకు సుమారు రూ. 12 లక్షల దాకా పారితోషకం వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే పుష్ప మొదటి భాగంలో తక్కువ నిడివితోనే అనసూయ క్యారెక్టర్ ఉంది. అయితే రెండో భాగంలో మాత్రం అనసూయ క్యారెక్టర్ లెంత్, ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. రెండో భాగంలో ఫహాద్ ఫాజిల్ తో కలిసి పుష్పపై రివేంజ్ తీసుకునే క్యారెక్టర్ లో అనసూయ కనిపిస్తుందని టాక్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…