Krack Movie: క్రాక్ సినిమాలో రవితేజ కొడుకు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Krack Movie: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గత ఏడాది కరోనా లాక్ డౌన్ తర్వాత క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా నాలుగేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని రవితేజ అందుకున్నారని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో రవితేజ కొడుకు పాత్రలో నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ బుడ్డోడు రవితేజ పైనే సెటైర్లు వేస్తూ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నారు.ఇలా ఈ చిన్నారి నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ అతని పై ప్రశంసలు కురిపించారు. మరికొందరైతే ఈ బుడ్డోడు ఎవరు అంటూ ఆరా తీశారు.రవితేజ పై పంచులు వేస్తూ ఎంతో అద్భుతంగా నటించిన ఈ కుర్రాడు ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం తెలిస్తే తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు.
ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు అనే విషయానికి వస్తే డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజ కొడుకు పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.ఇక ఆ పాత్ర గురించి బాగా తెలియడంతో ఆ సినిమాలో బాల నటుడిగా మరొకరు ఎందుకని స్వయంగా తన కొడుకు సాత్విక్ ను బాల నటుడిగా ఈ సినిమాలో లాంచ్ చేశారు గోపీచంద్.
ఇలా క్రాక్ సినిమా ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ బుడ్డోడు స్వయంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కుమారుడు సాత్విక్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బుడ్డోడికి వరుస అవకాశాలు వచ్చాయి.అయితే ఇప్పుడే సినిమాల్లోకి వస్తే తన కెరియర్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో సినిమాలకి ఒప్పుకోవడం లేదు.అయితే గోపీచంద్ తాజాగా బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో కూడా సాత్విక్ బాలకృష్ణ కొడుకు పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…