వెంకటేష్ – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయని మీకు తెలుసా.!!

శత చిత్రాలను పూర్తి చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఏ. కోదండరామిరెడ్డి ఒకరు. 1970 ద్వితీయార్థంలో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఏ.కోదండరామిరెడ్డి అనతికాలంలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ఎన్టీఆర్ మినహా మిగతా స్టార్ హీరోలతో కోదండరామిరెడ్డి సినిమాలను రూపొందించారు. ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలతో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన కోదండరామిరెడ్డి వెంకటేష్ తో రెండు చిత్రాలను రూపొందించారు. అవి బాక్సాఫీస్ వద్ద ఈ విధంగా ప్రదర్శింపబడ్డాయి.

వెంకటేష్ - కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయని మీకు తెలుసా.!!

1991, మహేశ్వరి పరమేశ్వరి ఫిలిమ్స్, టి.సుబ్బిరామి రెడ్డి నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “సూర్య IPS” చిత్రం విడుదలయ్యింది. ‘కొండవీటిదొంగ’ లాంటి విజయవంతమైన చిత్రంతో ఏ.కోదండరామిరెడ్డి.. ‘బొబ్బిలిరాజా’ వంటి బ్లాక్ బస్టర్ తో వెంకటేష్ మంచి స్వింగ్ లో ఉన్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ‘సూర్య IPS’ చిత్రానికి కూడా ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో “ఓం నమో నమ యవ్వనమా” అనే పాట అప్పట్లో ప్రజాదరణ పొందినప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు.

1995 ఎల్.వి.ఎస్ ప్రొడక్షన్స్, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “పోకిరిరాజా” చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో వెంకటేష్, రోజా, ప్రతిభాసిన్హా, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి స్వరపరిచిన “కలగా వచ్చినావు గిలిగింతలు పెట్టినావు లలనా”.. వంటి పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. బాలకృష్ణతో ‘బొబ్బిలి సింహం’ లాంటి హిట్ సినిమాను రూపొందించిన కోదండరామిరెడ్డి… రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముద్దుల ప్రియుడు’ లాంటి విజయవంతమైన చిత్రంలో నటించి వెంకటేష్ మంచి స్వింగ్ లో ఉన్నారు. ఆ క్రమంలో విడుదలైన ‘పోకిరిరాజా’ చిత్రం ఈ ఇద్దరిని నిరాశపరిచింది. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి ఒక్క వెంకటేష్ మినహా మిగతా హీరోలందరితో విజయవంతమైన చిత్రాలను రూపొందిందించడం గమనార్హం.