Categories: Featured

తెలంగాణలో విషాదం.. చీమలకు భయపడి ప్రాణం తీసుకున్న యువతి – ఫోబియా దారితీసిన దారుణం!


తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. మైర్మేకో ఫోబియా (చీమలకు భయం) అనే అరుదైన మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక యువతి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడింది.

చిన్నప్పటి నుంచే చీమల భయం – ఫోబియాగా మారిన సమస్య

మంచిర్యాల జిల్లా మూలంగా ఉన్న మనీషా (25)కు చిన్నప్పటి నుంచే చీమలు అంటే విపరీతమైన భయం ఉండేది. ఈ భయం కాలక్రమంలో తీవ్రమై, మైర్మేకో ఫోబియా అనే అరుదైన మానసిక వ్యాధిగా మారింది. భర్త శ్రీకాంత్ ఉద్యోగ కారణంగా ఈ దంపతులు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని నవ్యా హోమ్స్‌లో నివసిస్తున్నారు. వీరికి అంబిక అనే మూడేళ్ల కుమార్తె ఉంది.

ఫోబియా తీవ్రత పెరిగి విషాదానికి దారితీసింది

మనీషా గతంలో పలు సార్లు వైద్యుల సలహాలు మరియు కౌన్సిలింగ్‌లు తీసుకున్నప్పటికీ, ఆమె భయం తగ్గలేదు. చీమలను చూసినా గడగడలాడిపోతూ, తీవ్రమైన భయంతో కుంగిపోయేది. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె మనసు దృఢంగా చేసుకుని ఉరి వేసుకుంది.

భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హృదయవిదారక సూసైడ్ నోట్

మనీషా రాసిన సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను వ్యక్తపరిచింది.

“ఐ యామ్ సారీ… నాకు చీమలు అంటే చాలా భయం. అన్విజాగ్రత్తగా ఉండు. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ వ్రతాలు మర్చిపోకు” అని పేర్కొనడం హృదయవిదారకంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైర్మేకో ఫోబియా కారణంగా ఈ యువతి ప్రాణాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యంపై అవగాహన ఎంత అవసరమో మరోసారి గుర్తుచేసింది.


telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago