Pushpa-Allu Arjun: ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుకలకు బన్నీ ప్లాన్… ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?
Pushpa-Allu Arjun: పుష్ప ఇచ్చిన సక్సెస్ కిక్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప భారీ వసూళ్లను రాబడుతోంది. ఊర మాస్ గెటప్ లో బన్నీ అదరగొట్టాడు. బన్నీ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా అయిన పుష్ప భారీ హిట్ కొట్టడంతో బన్నీ తెగ సంబరపడిపోతున్నాడు.
దీంతో పాటు త్వరలోనే పుష్ప-2 షూటింగ్ జరుగబోతోందనే సమాచారం కూడా వస్తోంది. అందుకు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయి.. దసరాకు లేదా క్రిస్మస్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
అయితే పుష్ప సక్సెస్ తో బన్నీ, సుకుమార్ లు చెన్నై, హైదరాబాద్ లో సక్సెస్ పార్టీలు కూడా ఇచ్చారు. సక్సెస్ మీట్ లు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓసక్సెస్ మీట్ లో బన్నీ ఎమోషనల్ కూడా అయ్యాడు. సుకుమార్ లేకుంటే… స్టైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్ అనేవి లేవని కంటతడి పెట్టాడు.
అయితే పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. కొన్ని రోజులు ఫ్యామిలీలో సరదాగా టూర్ ప్లాన్ చేస్తున్నాడు. వరసగా పుష్ప ప్రమోషన్లతో, షూటింగ్ తో అలసిపోయిన బన్నీ.. ఇప్పుడు పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీలో కలిసి గోవా వెళ్తున్నాడు. అక్కడే 2022 కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ప్లాన్ చేశాడు. తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ లతో గడపడానికి విరామం తీసుకున్నాడు. మళ్లీ త్వరలోనే సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఈకొద్ది సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాడు బన్నీ. ఇదిలా ఉంటే సమంత కూడా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి గోవాలోనే ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…