ఇప్పటివరకు అంతరిక్షంలో మానవులు వెళ్లి ఎన్నో పరిశోధనలు చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా బుల్లి జీవులను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనుంది. ఆక్టోపస్ వంటి స్కిడ్స్, ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోకి పంపనుంది. స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్ -22 మిషన్ ద్వారా ఈ జీవరాసులను గురువారం అంతరిక్షంలోకి పంపనుంది. ఈ విధంగా బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్)ను 1998లో ప్రారంభించారు. భూమిపై సాధ్యం కాని పరిశోధనలను అంతరిక్షంలో చేయడానికి పరిశోధకులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా కొన్ని వేల పరిశోధనలు జరిగాయి. తాజాగా ఐఎస్‌ఎస్ ద్వారా మొట్టమొదటిసారి అంతరిక్షం లోకి ఎలుగుబంటి (వాటర్ బేర్స్) ను పంపించనున్నారు.
ఎనిమిది పాదాలు కలిగిన వాటర్ బేర్స్ సాధారణంగా జంతుజాలం జీవించే వాతావరణంలో కన్నా ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఇది జీవించగలవు. అందుకోసమే వీటిని అంతరిక్షంలోకి పంపి సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా పనిచేస్తుందనే విషయం తెలుసుకునేందుకు అధ్యయనం చేయనున్నారు. అదే విధంగా ఈ వాటర్ బేర్స్ సంతానాన్ని కూడా ఇక్కడే అభివృద్ధిపరిచే వాటిలో వచ్చేటటువంటి జన్యు మార్పులను గుర్తించబడుతుంది.
ఈ విధంగా అతి సూక్ష్మ జీవులను అంతరిక్షంలోకి పంపడానికి ద్వారా భవిష్యత్తులో రాబోయే కొన్ని సవాళ్లను అధిగమించడానికి ఈ అధ్యయనం ఎంతో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకోసమే ఈ బుల్లి జీవులను అంతరిక్షంలోకి పంపిస్తున్నట్లు నాసా వెల్లడించింది. సూక్ష్మజీవి–జంతువుల సహజీవనంపై అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం కోసమే ఈ పరిశోధనలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జీవుల మధ్య ఏ విధమైనటువంటి గురుత్వాకర్షణ ప్రభావం ఉంటుందో సరిగా తెలియడం లేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…