Karthika Deepam
బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. గత ఎపిసోడ్ లో పిల్లలు 25వ తేదీ మమ్మల్ని బయటకు తీసుకెళ్తామని చెప్పారు కదా గుర్తుందా.. తీసుకెళ్ళండి అంటూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది. నేడు ఈ సీరియల్ 1112 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ క్రమంలోనే సౌర్య దీపతో మాట్లాడుతూ.. మీరు మరిచిపోతారని నేనుక్యాలెండర్ లో 25వ తేదీని టిక్ చేసి పెట్టాను అంటూ క్యాలెండర్ వైపు చూపిస్తుంది.
క్యాలెండర్ వంక చూస్తూ దీప హాస్పిటల్ లో మోనిత 25వ తేదీ కార్తీక్ వస్తాడు… మా పెళ్లి జరుగుతుంది అంటూ పిచ్చి పట్టినదానిలాగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అంతలో పిల్లలు వెళ్దామని చెప్పడంతో నాదేముంది మీ నాన్న వస్తే వెళ్దాం నేను రెడీగా ఉన్నాను అంటుంది. నాన్న ఏదో పెద్ద ఆపరేషన్ ఉందని హాస్పిటల్ కి వెళ్ళాడు అని చెప్పడంతో.. అవును నాన్న లేకుంటే మనం ఎలా వెళ్తాము అని చెబుతారు. బస్తీలో వ్యాక్సిన్ వేస్తున్నారంటమ్మ అందరూ భయపడుతున్నారట మేము వెళ్లి వారికి ఏం కాదు అని ధైర్యం చెబుతాను అంటూ పిల్లలు బయటకు వెళ్లారు.
ఇక అర్ధ పావు భాగ్యాన్ని మోనిత తన ఇంట్లో కట్టిపడేసిన సంగతి మనకు తెలిసిందే. మెలుకువ వచ్చిన భాగ్యం ఇదేంటి దీనిని కిడ్నాప్ చేయాలని వస్తే నేను ఇరుక్కుపోయాను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ పెళ్లి ఎలా ఆపాలి.. భగవంతుడా నువ్వే నా కుటుంబాన్ని కాపాడాలంటూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అంజి దగ్గరికి వెళ్లిన కార్తీక్ ఇంటికి రాకపోయేసరికి దీప కంగారు పడుతూ ఉంటుంది. అంతలోనే కార్తీక్ రావడంతో ఏమైంది అంజి ఏం చెప్పాడు.. అని అడగగా వాడు ఏం చెప్తాడు ఇంతకుముందు వాడు ఏం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తున్నాడు. వాడు చెప్పే మాటలకు పెళ్లి ఎలా ఆగుతుంది..? అని కార్తీక్ అనడంతో మీరు అంజి మాటలు నమ్మడం లేదా… ఆ అంజిని వెంటబెట్టుకు వచ్చి ఏసిపి ముందు పడేస్తే హిమను చంపించింది మోనిత అని.. ఆ యాక్సిడెంట్ చేసింది అంజి అని బయటపడితే ఆ మోనిత జైలుకు వెళుతుంది. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అని సమాధానం చెబుతుంది.
పెళ్లి ఆగిపోవడం కోసమే ఇలా చేస్తున్నారని ఏసిపి అంటే.. అని కార్తీక్ అనగా.. మీరు, ఏసీపీ మేడమ్ ఈ విషయం నమ్మేలా నా దగ్గర ఒక సాక్ష్యం ఉందని హోటల్లో మోనిత అంజి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీసి ఉంటుంది. ఆ వీడియో కార్తీక్ కు చూపించగా.. ఆ వీడియో చూసిన కార్తీక్ షాక్ అవుతాడు. అందులో మోనిత హిమను నీ చేత ఎలాగైతే పంపించానో నిన్ను అలాగే చంపుతా…ఒకే కారులో ఉన్నప్పటికీ కార్తీక్ ను చంపకుండా హిమను ఒక్కటే చనిపోయేలా యాక్సిడెంట్ చేశావు చూడు అది మాత్రమే నువ్వు నాకు చేసిన ఫేవర్ అన్న మాటలను విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీప ఆగండి మంచినీళ్లు తీసుకువస్తానని లోపలికి వెళ్లగానే కార్తీక్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. దీపం డాక్టర్ బాబు అనగా.. అమ్మ నాన్న కారులో ఎక్కడికో వెళ్ళాడు అంటూ పిల్లలు చెప్తారు. సరే మీరు వెళ్లి భోజనం చేయండి అంటే పిల్లలని లోపలికి పంపుతుంది.
దీప వెంటనే డాక్టర్ బాబుకు ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడగగా.. డాక్టర్ భారతి ఫ్రెండ్ చనిపోయిందనీ అక్కడికి వెళ్తున్నాను అని చెబుతాడు. పిల్లలు వచ్చారా మీరందరూ భోజనం చేయండి ఒక గంటలో వస్తాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు.సారీ దీపం మోనితను చంపడానికి వెళ్తున్నాను అని చెప్తే నువ్వు కంగారు పడతావు అందుకే చెప్పలేదు అని మనసులో అనుకొని బయలుదేరుతాడు. మరోవైపు దీప తండ్రి మురళీకృష్ణ భాగ్యం ఎక్కడికెళ్ళిందో అంటూ కంగారు పడతాడు.ఎక్కడికి వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్పేది ఇంత సేపు అయిన రాలేదంటే ఏం జరిగిందో అంటూ కంగారు పడతాడు. మోనిత ఎంత తప్పు చేసిందని తెలిసిన డాక్టర్ బాబు ఎందుకు అంత ప్రశాంతంగా ఉన్నాడు. అంటూ దీప ఆలోచిస్తుండగానే ఆదిత్య ఫోన్ చేస్తాడు. వదిన అన్నయ్య ఎంతో సీరియస్ గా ఇక్కడికి వచ్చాడు. వచ్చి రావడంతోనే మమ్మీ గదిలోకి వెళ్ళాడు. తర్వాత నాన్నకు మందులు మార్చాలి అని చెప్పి వేరే టాబ్లెట్స్ రాసిచ్చి నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు అని చెప్పడంతో నేను మీ అన్నయకి ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేస్తుంది.దీప కార్తీక్ కు ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు.
కట్ చేస్తే మోనిత అంజి తప్పించుకున్నాడని కంగారు పడుతూ ఉంటుంది. అంతలో తలుపు కొట్టిన శబ్దం రాగానే అక్కడ ఉన్న భాగ్యం ఎవరు వచ్చి ఉంటారు. నన్ను కిడ్నాప్ చేసినట్టు దీపను కూడా కిడ్నాప్ చేసిందా అని కంగారు పడుతుంది. అంతలోనే మోనిత కార్తీక్ అనగానే ఆ మాటలు విన్న భాగ్యం మరింత కంగారు పడుతుంది.కార్తీక్ ని చూడగానే మౌనిత ఎంతో సంతోష పడుతుంది నా కార్తీక్ వచ్చావా కార్తీక్… నేను అనుకుంటూనే వస్తాడు నా రాజు… ఈ రోజు.. అని పాడుకుంటూనే ఉన్నాను. ఎంత మంచి వాడివి కార్తీక్ నా ప్రేమ.. నా తపన.. నా ఆశ అన్ని అర్థం చేసుకుని వచ్చావా కార్తీక్ .. రా కార్తీక్ నీకోసమే తపస్సు చేస్తున్నాను.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిగా వచ్చావు కదూ.. నా మనసులో పెంచుకున్న ప్రేమకు దానికి సమాధానం నా మెడలో తాళి కడతానని చెప్పడానికి వచ్చావ్ కదా…రా కార్తీక్.. నవ్వుతున్న మోనితను నోర్ముయవే.. అని కార్తీక్ అనగా ఏంటి అప్పుడే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు అని మోనిత అనగా ఎవరే పెళ్ళాం… నా పెళ్ళాం పేరు దీప కార్తీక్ అన్న మాటలకు లోపల ఉన్న భాగ్యం కాస్త కుదుట పడుతుంది.
చచ్చేదాకా తానే నాకు పెళ్ళాం.. నీలాంటి మోసగత్తెలు ఎంతమంది వచ్చినా నా కాలిగోటితో సమానం… ఆపు కార్తీక్ ఎన్ని అన్నా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే తండ్రి. ఈ సమస్యకు పరిష్కారం నువ్వు తాళి కట్టడమే అని అంటుంది. అవును ఈ సమస్యకు పరిష్కారం పెళ్లి కాదు…. నీ చావు… అంటూ ఎంత మోసం చేశావు. కేవలం నన్ను ప్రేమించిందన్న కారణంతో హిమను చంపించావు అంటూ అసలు విషయం మోనిత దగ్గర పెట్టడంతో మోనిత షాక్ అవుతుంది.. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఆ తర్వాత ఎపిసోడ్ లో దీప కార్తీక్ మాట్లాడుతూ ఉండగా ఏసిపి రోషిని ఎంటర్ అవుతుంది. రోషిని చూసిన దీప రండి మేడమ్ మేమే మీ దగ్గరికి వస్తున్నామని అనగా… ఎందుకు సరెండర్ అవ్వడానికా.. కార్తీక్ మోనిత శవాన్ని ఎక్కడ దాచి పెట్టావో చెప్పు.. మోనిత షూట్ చేసి శవం కూడా కనిపించకుండా ఎక్కడ పెట్టావ్ అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.. ఎసిపి రోషిని కార్తీక్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.. నిజంగానే కార్తీక్ మోనితను చంపాడా..? లేదా? అనేది తెలియాల్సి ఉంది
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…