Featured

Doctor Harsha friend Vijay : మూడు వారాల కంటే ఎక్కువ బ్రతకను… రోజూ కాల్ చెయ్ అని చెప్పేవాడు… ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే నేను లేనట్టే అని చెప్పి…: డాక్టర్ హర్ష స్నేహితుడు విజయ్

Doctor Harsha friend Vijay : 32 ఏళ్లకే క్యాన్సర్ తో పోరాడి మరణించిన డాక్టర్ హర్షవర్ధన్ తాను మరణించినా తన మరణాన్ని స్వీకరించిన విధానంతోనే అందరినీ కన్నీరు పెట్టిస్తున్నారు. క్యాన్సర్ తో పోరాడుతూ తాను బాధపడుతున్నా తనవారికి మనో ధైర్యాన్ని నింపి మరణించారు. తన అంత్యక్రియలకు తానే అందరినీ పిలిచి మరీ మరణించాడు. జీవితంలో మరణం అందరికీ వస్తుంది కానీ దాన్ని ఎలా స్వీకరిస్తున్నామన్న దానికి కొత్త భాష్యం చెప్పారు హర్షవర్ధన్. బ్రతికినన్ని రోజులు తన వాళ్లతో మాట్లాడుతూ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని ఎంతో మందికి సహాయం చేస్తూ తనవల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడుతూ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన హర్షవర్ధన్ గారిని తలచుకుంటూ ఆయన స్నేహితులు ఎమోషనల్ అవుతున్నానరు. ఆయన గురించి పలు జ్ఞాపకాలను ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

క్యాన్సర్ అని చెప్పినపుడు బాగా ఏడ్చాడు…

హర్షవర్ధన్ పెళ్ళైన తరువాత ఆస్ట్రేలియా వెళ్ళగానే తనకు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. ఇక తన స్నేహితుడు విజయ కృష్ణ కు ఈ విషయం చెప్పి బాగా ఏడ్చాడట హర్ష. చదువుకునే సమయం నుండి స్నేహితులుగా ఉన్న విజయ్ అలాగే హర్ష ఇద్దరూ అన్నీ విషయాలనూ మాట్లాడుకునేవారు. ఇక క్యాన్సర్ సోకిన తరువాత హైదరాబాద్ వచ్చెయ్ ఇక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడే చికిత్స తీసుకోమని చెప్పినా తాను చికిత్స తీసుకునే సమయంలో పడే బాధ చూసి తల్లిదండ్రులు తట్టుకోలేరని అందుకే ఇక్కడే ఉంటాను అని ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు అంటూ హర్ష స్నేహితుడు విజయ్ చెప్పారు. తనను చూడాలని ఉందని ఇండియా వచ్చినపుడు కలుద్దామని చెప్పినా వద్దు నన్ను ఇలా చూస్తే మీరు బాధపడతారు, నాకు అలా మీరందరూ నన్ను జాలిగా చూడటం ఇష్టం లేదు అని తాను మమల్ని కలవలేదు అంటూ విజయ్ తెలిపారు. అయితే చనిపోయే కొద్ది రోజుల ముందు కాల్ చేసి ఇక ఎక్కువ రోజులు బ్రతకను కేవలం మూడు వారాలని డాక్టర్స్ చెప్పారు అని చెప్పి రోజూ ఫోన్ లేదా మెసేజ్ చేస్తుండు, ఏ రోజైతే రిప్లై రాదో ఆ రోజు నేను లేనట్లు అంటూ చెప్పినపడు చాలా ఏడుపొచ్చింది. ఇక తన పేరెంట్స్ నంబర్స్ నాకు పంపించి ఒకవేళ నా నుండి మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే నాన్ కు కాల్ చెయ్ ఆయన విషయం చెబుతారు, నా అంత్యక్రియలకు రా అంటూ పిలిచాడు. ఆ రోజు చాలా బాధపడ్డాము.

మార్చి 22న మాట్లాడాను ఏమీ కాదు అని చెప్పినా నాకు తెలుస్తోంది నేను ఎక్కువ రోజులు బ్రతకను ఇంక డేస్ ఉన్నాయి అంటూ చెప్పాడు. తమ్ముడి పెళ్ళికి మే లో కలుద్దామని తానే చెప్పి ఇలా మరణిస్తాడని అనుకోలేదు. తనని తన పెళ్ళిలోనే చివరగా చూడటం అంటూ చెప్పారు విజయ్. తనకు సేవాభావం చాలా ఎక్కువ, ముందు నుండి అలాగే ఉండేవాడు, అందుకే ఆ దేవుడే కాపాడతాడు అనుకున్నాం ఆ మంచే కాపాడుతుంది అనుకున్నాం కానీ ఇంత తొందరగా తీసుకెళ్తాడని అనుకోలేదు. హర్ష కి తన తల్లి అంటే చాలా ఇష్టం అంత్యక్రియలపుడు తన తల్లిని మేము ఫేస్ చేయలేకపోయాం. అంటీ బాధను ఎవరూ తీర్చలేము అంటూ హర్ష స్నేహితుడు విజయ్ ఎమోషనల్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago