MS Raju: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గతంలో ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమకథా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఈయన ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తాజాగా ఈయన కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదలయ్యి మంచి ఆదరణ సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ టికెట్ల విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లు గురించి ప్రస్తావిస్తూ సింగిల్ థియేటర్ కి కూడా దాదాపు 200 వరకు టిక్కెట్ల రేట్లు ఉన్నాయని తెలిపారు.
ఈ విధంగా సింగిల్ థియేటర్లో 200 రూపాయల టికెట్ ధరలు ఉంటే చాలా మంది సినిమాని థియేటర్ లో చూడటానికి ఇష్టపడటం లేదు. ఇలా టికెట్ల రేట్లు అధికంగా ఉండటం వల్ల చాలామంది సినిమాని ఓటీటీలో చూడాలని భావిస్తున్నారు. తద్వారా చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి. టికెట్ల రేట్లు అధికంగా ఉంటేనే పెద్ద సినిమాలకు ప్రేక్షకులు రావడం కష్టమైంది. ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పనవసరం లేదు.
చిన్న సినిమా బ్రతకాలంటే టికెట్ల రేట్లు పూర్తిగా తగ్గించాలని ఈ విషయంపై సినీ పెద్దలు ప్రభుత్వాలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంటుందని నిర్మాత ఎమ్మెస్ రాజు వెల్లడించారు. గతంలో టికెట్ల రేటు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొందరు హీరోలు ప్రభుత్వాలతో మాట్లాడి సినిమా టికెట్ల రేట్లను పెంచాలని సూచించారు.ఇలా సినిమా టికెట్లు రేట్లు పెంచడంతో సామాన్యుడికి సినిమాలు చూడటం భారంగా మారింది. తద్వారా ప్రేక్షకులు థియేటర్ కి రావడానికి ఇష్టపడటం లేదని వీలైనంత త్వరగా టికెట్ల రేట్లు విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలని ఆయన తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…