సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది. కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఎంత దారుణమో ఈ దృశ్యం చూపిస్తోంది.

31 సెకన్ల ఈ క్లిప్‌లో ఒక ఆటో డ్రైవర్ తీవ్ర గాయంతో ఉన్నప్పటికీ తన జీవన పోరాటాన్ని ఆపకుండా కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో అతని చేయి తీవ్రంగా విరిగిపోయి, భుజం నుంచి మోచేతి వరకు ఐరన్ రాడ్ అమర్చిన పరిస్థితిలో ఉన్నాడు. సాధారణంగా ఇలాంటి గాయంతో విశ్రాంతి అవసరమైనప్పటికీ, అతను మాత్రం రోడ్డుపై ఆటో నడుపుతూ కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
శారీరక నొప్పి ఎంత ఉన్నా, కుటుంబ బాధ్యతల ముందు అది చిన్నదైపోతుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. జీవనోపాధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అతను తీసుకున్న ఈ నిర్ణయం అతని ధైర్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ వీడియో ఎక్కడ తీసారన్నది స్పష్టంగా తెలియకపోయినా, నెట్టింట మాత్రం విస్తృతంగా షేర్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరూ ఆ డ్రైవర్ పరిస్థితిపై చలించిపోతూ స్పందిస్తున్నారు. “ఇదే నిజమైన పోరాటం”, “కుటుంబం కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు సమాజంలో కనిపించని అసలైన హీరోలను గుర్తు చేస్తాయి. ప్రతిరోజూ తమ కుటుంబం కోసం కష్టపడుతున్న సాధారణ మనుషులే నిజమైన యోధులు అన్న భావనను ఈ వీడియో మరింత బలంగా చెబుతోంది



























