మన దగ్గర ఏమైనా పాత వెహికిల్స్ ఉంటే.. అంటే 15 ఏళ్ల కంటే ఎక్కువ గడువు ఉన్నవి వాటి రెన్యూవల్ కు ఎక్కువ డబ్బులను ఇక నుంచి పే చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
నోటిఫికేషన్ లో పేర్కొన్న విషయాలు ఏంటంటే.. రిజిస్ట్రేషన్ జరిగి 15 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు అయితే ట్రక్, లేదా బస్సుల ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్‌కు 8 రెట్లు అధిక చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దాని రెన్యూవల్ కు రూ.1500 ఉండగా.. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అదనంగా రూ.12500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాత కారు విషయానికి వస్తే.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ రెన్యూవల్ రూ.600 ఉండగా.. 15 ఏళ్ల నాటి కారు అయితే ఏప్రిల్ 1, 2022 నుంచి రూ.5వేల కట్టాల్సిందే. ఇక టూవీలర్ల విషయంలో కూడా నియమ, నిబంధనలను వర్తింపజేశారు. ప్రస్తుతం రూ.300 తీసుకోనుండగా 15 ఏళ్లు దాటిని టూవీలర్ అయితే వచ్చే ఏప్రిల్ నుంచి రూ.1000 రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీ చెల్లించుకోవాలి.
అంతేకాకుండా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకునే వాహనాలకు ఆ గడువు ముగిసిపోయిన రోజు నుంచి ప్రతీ రోజు రూ.50 అదనపు ఫీజు వసూలు చేయనున్నారు. అదే రిజిస్ట్రేషన్ గడువు అయిపోతే మాత్రం.. రూ.200 అదనపు చార్జీ ప్రతీ రోజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము కింద మరో రూ.300 నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధనలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…