సమంత నాగ చైతన్య అక్టోబర్ 2వ తేదీ వారి గురించి వస్తున్న వార్తలు అన్ని నిజమంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య విడాకులు విషయం విన్న ఎంతోమంది అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు.ఈ క్రమంలోనే అభిమానులు పలువురు సినీ తారలు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అదేవిధంగా సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణాలు ఏంటి అని చాలామంది కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొందరు సమంత బాలీవుడ్ అవకాశాలు రావడంతో అందుకు అక్కినేని కుటుంబం ఒప్పుకోకపోవడం విడాకులు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా తన స్టైలిష్ ప్రీతంతో ఏదో సంబంధం ఉందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడుతున్నాయి.
ఈ క్రమంలోనే సమంత విడాకుల విషయమై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటే ఎంతో ఆలోచించి విడాకులు తీసుకొని ఉంటారు.ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం వారి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలియజేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ దగ్గుబాటి కుటుంబం ఏ మాత్రం స్పందించలేదు. తాజాగా నేడు విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా నాగచైతన్య విడాకుల విషయం పై స్పందించినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాకి దూరంగా ఉండే వెంకటేష్ మొట్టమొదటిసారిగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన కొటేషన్ చూస్తే ఖచ్చితంగా సమంత నాగ చైతన్యల విడాకుల గురించి మాట్లాడారని తెలుస్తోంది. ఈ సమయంలోనే వెంకటేష్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా వెంకటేష్ స్పందిస్తూ మనం మాట్లాడేటప్పుడు నోరు మాత్రమే కాకుండా.. మెదడును కూడా తెరిచి ఆలోచించాలి అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కొటేషన్ షేర్ చేయడంతో సమంత నాగ చైతన్య ల విడాకుల గురించి వస్తున్న రూమర్లపై వెంకటేష్ స్పందిస్తూ ఈ విధమైనటువంటి కొటేషన్స్ చేశారని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…