టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. వీరి జంట విడిపోవడంతో చాలామంది షాక్ కు గురయ్యారు. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు.
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా సమంత-నాగ చైతన్య విడాకుల వార్తే చర‍్చనీయాంశమైంది. మొదట వీరిద్దరి మధ్య వస్తున్న వార్తలు పూకార్లుగానే మిగిలిపోతాయని అందరూ భావించారు.. కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
ఈ విషయం సామాన్య ప్రజలను, అభిమానులను మాత్రమే కాదు పరిశ్రమకు చెందిన వారిని సైతం బాధించింది. తాము ఇద్దరం విడిపోతున్నా స్నేహితులుగా ఉంటామని వారిద్దరూ తమ ట్వీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. నేడు అంటే (అక్టోబర్ 6న) వారి పెళ్లి రోజు సందర్భంగా నెటిజన్లు వారి క్యూట్ కపుల్ గురించి చర్చించుకుంటున్నారు.
తాజాగా చైతు, సామ్ విడాకుల వ్యవహారంపై రాజీవ్ కనకాల కూడా స్పందించారు. విడాకులు అనేవి వారి వారి వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు..అలాంటప్పుడు వాళ్ల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాగచైతన్య వ్యక్తిగతంగా చాలా మంచి వాడు అంటూ చెప్పాడు. ఇకపోతే అతడు ‘లవ్ స్టోరీ’ సినిమాలో అతడు విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…