Featured

అక్కడ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే 10 లక్షల రూపాయల జరిమానా….!

భారత్ లో చాప కింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్నా కొందరు మాస్క్ ధరించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అయితే పలు దేశాలు మాత్రం కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. భారీగా జరిమానా విధించడం ద్వారా మాత్రమే వైరస్ ను అదుపు చేయడం సాధ్యమని భావిస్తున్నాయి. తాజాగా దుబాయ్ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరించింది. పోలీస్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ఏకంగా 10 లక్షల రూపాయలు జరిమానా విధించారు.

డైరెక్టర్ ఆఫ్ క్రిమిన‌ల్ ఇన్విస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌ దుబాయ్ పోలీస్ బ్రిగేడియ‌ర్ జ‌మాల్ స‌లేం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే దుబాయ్ కు చెందిన ఒక యువకుడికి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అధికారులు అతడిని హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించగా ఆ వ్యక్తి మాత్రం ఇష్టానుసారం బయట తిరిగాడు.

సదరు వ్యక్తి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి కాఫీ షాపులో ఉన్న సమయంలో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది. విషయం తెలిసిన అధికారులు ఆ యువకుడిని పట్టుకుని 50 వేల దిర్హామ్స్‌ (భారతదేశ కరెన్సీల్లో పది లక్షలు) జరిమానా విధించారు. అధికారులు భారీ జరిమానాలు విధిస్తే మాత్రమే కరోనా కట్టడి సాధ్యమవుతుందని…. ప్రజలు నిబంధనలు పాటిస్తారని చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

1 hour ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

2 hours ago

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…

6 hours ago

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్‌కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోనే…

7 hours ago